కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసి, రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరచే విధంగా రుణాల లక్ష్యల ప్రగతిని సాధించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్ర శాంతి అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్యశాఖ, మైక్రో ఇరిగిషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్‌బీ, డీఆర్‌డీఏ శాఖల ద్వారా చేపటి అమలు చేస్తున్న ప్రగతి లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ మొదటిగా జిల్లాలో వ్యవసాయ అను బంధ రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, సంక్షేమ శాఖల పనితీరుపై శాఖల వారీగా రెండో వంద రోజుల కార్యాచరణ అమలుకై నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. అలాగే వ్యవసాయ రంగంలో చేపట్టిన కార్యక్రమాల లక్ష్యసాధనను పూర్తిచేయాలన్నారు.
భూసార పరీక్షలు, వరితో పాటు ఇతర అంతర పంటలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసి, రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరచే విధంగా రుణాల లక్ష్యల ప్రగతిని సాఽధించాలన్నారు. జిల్లాలో మామిడి, అరటి, కోకో పండ్లు తోటల ప్రగతిపై సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన అంతర్గత రహదారులు లింక్ రోడ్ల నిర్మాణం, నిడదవోలు పట్టెంపాలెం రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించాలన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.10 కోట్లతో 120 పనులు మంజూరు కాగా 46 పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తికాగా 19 గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయని, 6పనులు పూర్తయ్యాయన్నారు. డ్రైన్, కల్వర్టుకు సంబంఽధించి రూ.15 కోట్లతో 74పనులు మంజురు కాగా టెండర్లు ప్రక్రియలో ఉన్నట్టు తెలిపారు. అలాగే మత్సశాఖ, పశుసంవర్దక శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రగతి చేపట్టిన పనులను రెండో 100 రోజుల లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధి కారి ఎస్.మాధవరావు, జిల్లా మత్య్స శాఖాధికారి వి.కృష్ణారావు, జిల్లా మైక్రో ఇరిగిషన్ అధికారి ఎ. దుర్గేష్, బి.సుజాతకుమారి, డీఆర్‌డీఏ పీడీ ఎన్వీ వీఎస్ మూర్తి, జిల్లా అర్‌అండ్‌బీ అధికారి ఎస్‌బీ వీ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.