సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాపోయారు. మీడియా ముఖంగా అయన మాట్లాడుతూ..... సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు.
మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైయస్ జగన్పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.