రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే గౌతు శిరీషను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కమిటీ సభ్యులను ప్రకటించారు. గౌతు శిరీష మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, ప్రభుత్వానికి వనరులు సమకూర్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. సీఎం చంద్రబాబుకు, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa