గజపతినగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో 139 మంది హాజరు కాక 53 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు.