ఏర్పేడు మండల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు సీఐ జయచంద్ర పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం సీఐ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.