సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఈ ప్రజావేదికలో ఏపీ వక్స్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పీతల సుజాత పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పాల్గొని సమస్యలను వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.