టెక్కలి మండల కేంద్రంలోని స్థానిక పాండవులమెట్ట వద్ద ఆదివారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు టెక్కలి సీఐ ఏ. విజయ్ కుమార్ ఆదివారం రాత్రి తెలిపారు. జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి నిర్వహించగా 24 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1, 34లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.