ఇళ్లస్థలాలు, సాగుభూముల కోసం ఉద్యమం చేపడతామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం పేర్కొన్నారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పేదలకు ఇంటిస్థలం మంజూరు చేయాలన్నారు. పేదలకు న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు.