ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో ఆత్మహత్యకి పాల్పడిన దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 05:51 PM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చిన్నచిన్న వివాదాలు వస్తున్నప్పటికీ వారు కలిసే ఉన్నారు. పలుమార్లు వివాదాలు ఘర్షణలకు దారి తీయడంతో ఇరు కుటుంబాల పెద్దలు వారిని మళ్లీ ఒకటి చేశారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే కొన్ని రోజులుగా వారి మధ్య ఏదో విషయంలో మళ్లీ వివాదం చెలరేగింది. ఇక తామిద్దరం కలిసి బతకలేయని నిర్ణయించుకున్నారు దంపతులు.


అయితే గోపీకృష్ణ, వాసవి దంపతులు విడాకుల వైపు మెుగ్గు చూపకుండా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం తెల్లవారుజామున మచిలీపట్నంలో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. అయితే ప్రమాదంలో వాసవి అక్కడికక్కడే మృతిచెందింది. గోపీకృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబకలహాలే బలవన్మరణానికి కారణమని గోపీకృష్ణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com