ఏపీలో నిరంకుశ, దుర్మార్గ పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది. ప్రత్యర్థులను అణిచివేసే ధోరణి చాలా నిరంకుశంగా జరుగుతోంది. తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు.
సోషల మీడియాలో పోస్ట్‌ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్‌బెల్ కేసులు పెట్టారు. పసుపు చొక్కా లేసుకుని ఉద్యోగాలు చేయొద్దని పోలీసులను కోరుతున్నాను. గత పదేండ్ల కాలంలో వైయస్ఆర్‌సీపీ ఒక పర్సంటేజ్‌సోషల్ మీడియా పోస్టులు పెడితే, టీడీపీ, జనసేన 99 శాతం అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. తునిలో మామ-అల్లుళ్ల పాలన కొనసాగుతోంది. అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే.. మామ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.