పరువు గురించి మాట్లాడే నైతక హక్కు, అర్హత వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి లేవు అని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు. ‘‘రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన నువ్వు నన్ను సన్మానించండని కోరడం ఏంటి జగన్మోహన్‌రెడ్డి. సోలార్ విద్యుత్ ధరలు రోజు రోజుకూ దిగజారిపోతుంటే నువ్వుమాత్రం యూనిట్ విద్యుత్ ధర రూ.2.49కు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నావు.సెకీ అనేది ఇతర రాష్ట్రాలకు ఎందుకు లేఖ రాయలేదు. ఎందుకు ఏపీ ప్రభుత్వానికే లేఖ రాసిందో చెప్పగలవా జగన్. ప్రపంచ ఆర్థిక నేరగాడివైన నీకు పరువెక్కడ ఉంది జగన్.. నువ్వు పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదం.
నీకు నిజంగా పరువు ఉంటే ఎఫ్.బి.ఐ మీద దావా వేసే దమ్ముందా. నువ్వు పరువునష్టం దావా వేయాలని మేం కోరుకుంటున్నాం. కోర్టులో నీ నిజస్వరూపం బయటపెడతాం. అవినీతే ఆరోప్రాణంగా...అబద్దాలే జన్మహక్కుగా భావించిన జగన్మోహన్‌రెడ్డి విద్యుత్ రంగాన్ని తన లంచాల దాహంతో ఐదేళ్ల పాటు సర్వనాశనం చేశాడు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జగన్మోహన్‌రెడ్డిని వివిధ దర్యాప్తు సంస్థలు అవినీతిపరుడు అని తేల్చినా జగన్మోహన్‌రెడ్డి ఇంకా అబద్దాలు చెప్పడం దారుణం’’ అని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.