సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారికి మద్దతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయడంపై హైకోర్టు విజయ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిందది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు తమ హక్కులు తెలుసుకోకుండానే పోస్టులు పెడుతున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని, వారి తరపున పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేనివారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని కోర్టు అభిప్రాయపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.