విజయనగరం కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అర్బన్ రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సిబ్బందికి అడ్మిన్ కార్యదర్శులకు కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించుకుని అడ్మిన్ ప్రణాళిక కార్యదర్శి సిబ్బంది సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలన్నారు.