చిన్నమండెం మండలం, కొత్తపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో శుక్రవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తపల్లి కాలనీని మురికి నీటి రహిత కాలనీగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రతి వీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు