ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్ రంగానికి, పెద్ద వ్యాపారులకే రుణాలు ఇస్తున్న నేపథ్యంలో సహకార బ్యాంకులు సామాన్య ప్రజలకు రుణాలు అందించాలని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్వ చైర్మన్ మానం ఆంజనేయులు అన్నారు.
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం ఆయనకు అభినందన సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.