ఢిల్లీలో శాంతిభధ్రతలు క్షీణించాయని, ప్రజలను కాపాడాలని అడిగినందుకు కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళితే పరిష్కారం చూపిస్తుందని తాను భావించానని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి చర్యలు చేపడతారని భావించా కానీ తననే టార్గెట్ చేస్తారని, ఇలా దాడులు చేపిస్తారని అనుకోలేదని మండిపడ్డారు. శనివారం సాయంత్రం మాలవీయ నగర్ లో పాదయాత్ర చేసిన కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.చేతిలోని లిక్విడ్ ను కేజ్రీవాల్ పైకి విసిరాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. తాజాగా ఈ ఘటనను ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కానీ కూటమిలోని ఇతర పార్టీలతో కానీ ఆప్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం తాము చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నిక