సరైన ధ్రువపత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలకు చలానాలు విధించినట్లు ఫిరంగిపురం సీఐ రవీంద్రబాబు తెలిపారు. ఆదివారం ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన వాహనాల తనిఖీలు నిర్వహించారు. సుమారు 11 వాహనాలకు రూ. 8, 120 చలానాలు విధించినట్లు చెప్పారు.ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు కలిగి ఉండాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.