ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 11:43 AM

ఫెంగల్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత  సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు.


భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోందని... అలాగే నాయుడుపేట,పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో వాగులు, వంకల పొంగిపొర్లుతున్నందున పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద సముద్రం ముందుకొచ్చి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో వర్షాల ధాటికి కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రత పట్ల దృష్టి పెట్టాలని కలెక్టర్లకు హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com