ఏపీలో అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలో బుధవారం సిఐఐ నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
విశాఖ రీజియన్ లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ హబ్ గా విశాఖ తీర్చిదిద్దుతామన్నారు.