దేశంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవొద్దని సుప్రీంకోర్టు సూచించింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్ గా పిలవొద్దని ఆదేశించింది.
అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.