దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు. రైల్వే జోన్‌పై సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యవేక్షిస్తున్నారని.. మొత్తం మీద రైల్వే జోన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నా రు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంపై బుధవారం లోక్‌సభలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మాట్లాడడంతో కేంద్ర మంత్రి స్పందించారు.
2019లో విశాఖకేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించినా భూసమస్యల కారణంగా ప్రాజెక్టు ఐదేళ్ల పాటు ఆలస్యమయిందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రప్రభుత్వం భూమిని అప్పగించడంతో ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కిదని పేర్కొన్నారు. ఆపరేషనల్ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.