ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంలో కొత్తజంట.. మల్లన్నను దర్శించుకున్న అక్కినేని నాగచైతన్య, శోభిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 07:07 PM

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకుంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి అక్కినేని కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa