రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఎన్నో కులాలు, మతాలు, జమీందారీ సంస్థానాలతో ఉన్న మన భారతదేశాన్ని కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా ప్రతి మనిషి జీవించాలని ఆశించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa