మల్టీబ్యాగర్ స్టాక్ గత ఆరు నెలల కాలంలో ఏకంగా 650 శాతం మేర పెరిగింది. ఇప్పుడు తమ షేర్ హోల్డర్ల కోసం బోనస్ షేర్లు ప్రకటించింది. ఒక షేరు కొనుగోలు చేసిన వారికి మోర షేరును ఉచితంగా అందించనుంది. స్టాక్ మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు, షేర్ హోల్డర్లకు రివార్డ్ ఇచ్చేందుకు ఇలా బోనస్ షేర్లు ఇస్తారు. అదే పాదమ్ కాటన్ యార్న్స్ (Padam Cotton Yarns Ltd). ఈ కంపెనీ దారపు కండెలు తయారు చేస్తుంది. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్‌లో ట్రేడ్స్ నిర్వహిస్తుంది. టెక్స్‌టైల్ సంబంధిత కన్సల్టెన్సీ సేవలు అందిస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.127 కోట్లకుపైగా ఉంది. ఈ మైక్రో క్యాప్ స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
బోనస్ షేర్లు..
పాదమ్ కాటన్ యార్న్స్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవంబర్ 27వ తేదీన సమావేశమై బోనస్ షేర్లకు ఆమోదం తెలిపారు. 38,73,000 బోనస్ షేర్లు ఇవ్వనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక షేరుకు రూ.10 ముఖ విలువ కలిగిన మరో ఈక్విటీ షేరును బోనస్ షేరు ఇస్తోంది. ఇది షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే తొలుత పొరపాటున 38,37,000 బోనస్ షేర్లుగా పేర్కొన్నామని, అవి 38, 73,000 షేర్లుగా క్లారిటీ ఇచ్చింది.
పాదమ్ కాటన్ యార్న్స్ లిమిటెడ్ స్టాక్ క్రితం రోజు లాభాల్లో ముగిసింది. గడిచిన 5 రోజుల్లో 8 శాతం లాభపడింది. గడిచిన నెల రోజుల్లో 42 శాతం లాభాలు అందించింది. ఇగ గత ఆరు నెలల్లోనే 650 శాతం పెరిగింది. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 7.50 లక్షలు అందించింది. గత ఏడాదిలో 390 శాతం పెరిగింది. ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో చూసుకుంటే ఏకంగా 2,300 శాతం లాభాలు ఇచ్చింది. అంటే లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ.24 లక్షల లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 270గా ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 32 లక్షలుగా ఉంది. ఈ స్టాక్ పీఈ రేషియో 20.29 వద్ద ఉంది.