ప్యాపిలి యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా సమావేశం నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. మండల అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత, ఉద్యమ పితామహులు, అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయ సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఒకే యూనియన్ గా మార్చడంలో లక్ష్మయ్య కృషి చిరస్మరణీయమన్నారు.