అనంతపురం జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని అనంతపురం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, విక్రయిస్తున్న అనంతపురానికి చెందిన నలుగురు నిందితు లు అబుసలేహ, దస్తగిరి హుసేన, కిశోర్, వాచమెన ఆనంద్‌లను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన బూసుపల్లి వెంకటశివకుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. రాప్తాడు మండలం రైల్వే గేటు సమీపంలోని ఓ తోటలోని రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన ఏపీ ధరల మేరకు రూ.44 లక్షల విలువైన 474 బాక్సుల గోవా మద్యాన్ని (మ్యాన్సన హౌస్ క్వార్టర్ బాటిళ్లు) అనంతపురం ఎక్సైజ్ పోలీసులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటశివకుమార్‌రెడ్డి గతంలో పొలంలోని రేకుల షెడ్‌ను లీజుకు తీసుకొని గొర్రెల యూనిట్‌ను పెట్టినట్లు తెలిసింది.