ఈనెల 14 న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కాపీని వంగర మండలం కోణంగిపాడు జడ్పీ హైస్కూల్లో బుధవారం ఎన్నికల అధికారి, ఈ వో పి ఆర్ డి కెల్లా రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది అతికించారు.
మండలంలో ఇరువాడ, కోనంగపాడు, చంద్రంపేట, చౌదరివలస, గీతనాపల్లి గ్రామాలకు సంబంధించి ఈ నెల 14న కోణంగిపాడు హైస్కూల్లో నీటి సంఘాలు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.