ఫిబ్రవరి 28 నుంచి జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 1300 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, సుమారు 9,669 పౌర ప్రాంతాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ధ్వంసమైన వాటిలో 7,943 నివాస గృహాలు, 1,617 వాణిజ్య కేంద్రాలు, 65 పాఠశాలలు, 32 వైద్య సదుపాయాలు ఉన్నాయని ఇరవానీ వివరించారు. "అమెరికా, ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా మా పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా ఈ నేరాలకు పాల్పడుతున్నాయి" అని ఆయన ఆరోపించారు. టెహ్రాన్‌లోని ఇంధన నిల్వ కేంద్రాలు, మెహ్రాబాద్ విమానాశ్రయం, క్వెష్మ్ ద్వీపంలోని మంచినీటి శుద్ధి ప్లాంట్‌పై జరిగిన దాడులను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa