ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమహేంద్రవరం కల్తీ పాల కేసుని సీబీఐకి అప్పగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 09:48 AM

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన జ‌రిగి ఇప్ప‌టికి 24 రోజులు అవుతుంది. ఈ ఘ‌ట‌న‌పై నిజాలు వెలికి తీయాలనే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదా? అని వైసీపీ నేత మార్గని భరత్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ... ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కల్తీ పాల శాంపిల్స్‌ను నేషనల్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లకు పంపకుండా స్థానిక ల్యాబ్‌లకే పంపుతున్నారు.  అలా చేస్తే నిజాలు బయటకు రావు. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. రోజుకో బాధితుడి వెంటిలేటర్ తొలగించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తూ ఈ ఘటనను యాక్సిడెంటల్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్య‌క్తం చేశారు. ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa