భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. మొత్తం 14 గేమ్‌లలో గుకేశ్ 3, లిరెన్ 2 గేమ్‌లలో విజయం సాధించారు. తొమ్మిది గేమ్‌లు డ్రా అయ్యాయి. ఈరోజు జరిగిన లాస్ట్ క్లాసికల్ గేమ్.. 14 రౌండ్లో లిరెన్ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్ 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. 2012 తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. నిజానికి ఈ ఛాంపియన్షిప్ విజేతపై బుధవారమే క్లారిటీ రావాల్సి ఉంది. కానీ.. లిరెన్, గుకేశ్ 5 గంటల పాటు సుదీర్ఘంగా పోరాడి 6.5 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఓవరాల్‌గా 68 ఎత్తుల తర్వాత గేమ్ ఫలితం తేలే అవకాశం కనిపించకపోవడంతో.. ఇద్దరూ డ్రాకి అంగీకరించారు. ఈ క్షణం కోసం తాను పదేళ్లుగా కలలు కన్నానని గుకేశ్ అన్నాడు. తన కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ విజయాన్ని తాను ఊహించలేదని, ఈ ఘనత సాధించగానే భావోద్వేగానికి లోనయ్యానన్నాడు. తన దృష్టిలో లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్ అని పేర్కొన్నాడు. లిరెన్‌కు అతను ధన్యవాదాలు తెలిపాడు.