AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్టేషన్ లో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ కు తన అనుచరులతో కలసి వెళ్లారు. జగన్ పైనా, తమ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జగన్ పైనా, తమ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం తమ నుంచి ఫిర్యాదులు కూడా తీసుకోలేదని ఆయన పోలీస్ స్టేషన్ లో కాసేపు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.