మదనపల్లె సబ్‌రిజి స్ర్టార్ కార్యాలయంలో పనిచేస్తున్న డాక్యు మెంటు రైటర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని దస్తావేజులేఖకుల సంఘం అధ్యక్షుడు రంగు గుణశేఖర్ పేర్కొన్నారు. మదనపల్లెలో ఆదివారం ఆసంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఫైనా న్స బ్యాంకు సిబ్బంది వచ్చి సబ్‌రిజిస్ర్టార్ అధికారులు, సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని డైరెక్ట్‌గా రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు వాపోయారు. దీంతో కొన్నేళ్లుగా ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న తాము జీవనోపాధి కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 15ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్న వారు కొనసాగుతూ వారి వద్ద సహాయకులుగా పని చేస్తున్న వారి ని కూడా కమిటీలో చేర్చుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టానికి, నిబందనలకు లోబడి ఉన్న డాక్యుమెంట్లను మాత్రమే రాయాలని తేల్చిచెప్పారు. సమావేశంలో రైటర్లు ఎస్.చిన్నసాయి, తాళ్ల జయచంద్రనాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, హరిబాబునాయుడు, ఎస్.శ్రీనివాసులునాయుడు, ఎం.చంద్రశేఖర్‌రావు, గజేంద్ర, గణేష్‌స్వామి, రెడ్డెప్ప, నూర్ అహ్మద్, హామీ అహ్మద్ పాల్గొన్నారు.