ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌ అరెస్ట్ పై స్పందించిన పురందేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 03:26 PM

సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్టు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. పుష్ప-2 విడుదల సమయంలో అర్జున్‌ హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారని, అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాట ఆయన ప్రేరేపించింది కాదని తెలిపారు. ఈ కేసులో మిగిలిన వారిని కాకుండా ఏ-11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు.


ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలై భారీ వసూళ్లు తెస్తున్న సంగతి తెలిసిందే. కానీ దురదృష్టవ శాత్తు విడుదలైన రోజు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో విషాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com