ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గత వారం ఒక వ్యక్తిని చంపి కాల్చివేసిన కేసులో దర్యాప్తు నిమిత్తం ఈరోజు అనగా 22.12.2024 ఉదయం సంఘటన స్థలానికి జగిత్యాల జిల్లా DSP డి రఘుచందర్ గారు సందర్శించారు. దర్యాప్తులో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రామ్ నర్సింహారెడ్డి, ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి ఉదయ్ కుమార్ మరియు బుగ్గారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీధర్ రెడ్డి మరియు ధర్మపురి పోలీస్ స్టేషన్ సిబ్బంది DSP గారి వెంట ఉండి సంఘటన స్థలాన్ని సందర్శించి కేసులో భాగంగా శవ పంచనామా నిర్వహించగ, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ గారు సంఘటన స్థలంనికి చేరుకొని సంఘటన స్థలం లో శవ పరిక్ష నిర్వహించడం జరిగింది.
దర్యాప్తు లో భాగం గా నిందితులైన నేరెళ్ల గోపాల్ @ గోపాల్ రమేశ్ s/o రమేష్, వయస్సు 30 సంవత్సరాలు, కులం గౌడ్, r/o కమలాపూర్ గ్రామం మరియు గండికోట శేఖర్ s/o శ్రీనివాస్, వయస్సు 27 సంవత్సరాలు, కులం వడ్డెర, r/o నేరెళ్ళ గ్రామం లను కోర్ట్ యందు ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది.