భవాని నగర్ లోని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి నివాసంలో ఆదివారం అంగరంగ వైభవంగా మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గంటలకు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామిచే,ఇమ్మడి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామి మహాపడి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణు ఘోషతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇనుగుర్తి మధు అయ్యప్ప కళాబృందం మరియు అయ్యప్పమాలధారులు ఆలపించిన అయ్యప్ప పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.అయ్యప్ప పడిపూజ ముగిసిన తరువాత పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు అన్నదానం నిర్వహించారు . అనంతరం అయ్యప్ప స్వాములకు వారి కుటుంబ సభ్యులు పాదాభివందనాలు చేసారు.