75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలను పార్లమెంట్‌లో చూశామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో పేరుతో బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు.కాంగ్రెస్ నాయకులూ కావాలనే అమిత్ షా మాటలని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.