వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ నందు గణిత శాస్త్ర దినోత్సవం ను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 137 జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ మాంకాల యాదగిరి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి టీచర్స్ మరియు విద్యార్థుల సమక్షంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ మాంకాల యాదగిరి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గారు 22 డిసెంబర్ 1887 సంవత్సరo కోమలతమ్మాల్ కుప్పుస్వామి దంపతులకు జన్మించాడు మరియు 26 ఏప్రిల్ 1920 సంవత్సరంలో మరణించాడు.
శ్రీనివాస రామాంజన్ గారు అతి చిన్న వయసులోనే అపారమైన మేధస్సుతో ప్రపంచ శిఖరాలపై భారతదేశం కీర్తిని చాటి చెప్పిన మేధావి, దాదాపుగా 3900 గణిత సమీకరణాలను కనుగొన్నాడు అందుకే మన దేశం ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవం గా జరుపుకోవడం జరుగుచున్నది కావున విద్యార్థులందరూ రామాంజన్ గారిని ఆదర్శం తీసుకొని గణిత శాస్త్రంలో నైపుణ్యతను పెంపొందించుకొని శాస్త్ర,సాంకేతిక రంగాల్లో ఎదగాలన్నారు. రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు తయారు చేసిన గణిత ఫార్ములాల చార్టులలో నైపుణ్యత కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ ఇంచార్జి కర్ణాటి ఉష, అడ్మిషన్ ఇంచార్జి కంటే సంధ్యారాణి,టీచర్స్ శ్రీధర్ రాజ్ ,కల్యాణి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.