ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా గే జంటకు 100 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

international |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 07:12 PM

వారిద్దరూ అబ్బాయిలే. స్వలింగ సంపర్కులు కావడంతో.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్న వీరు పెళ్లి కూడా చేసుకుని హాయిగా జీవితం గడిపేస్తున్నారు. వీరికి పిల్లలు పుట్టరు కాబట్టి.. ఇద్దరు అబ్బాయిలను దత్తత తీసుకుని మరీ వారిని పెంచుతున్నారు. ఇంత ఆదర్శంగా కనిపించే ఈ జంట ఇంట్లో చేసే అఘాయిత్యాలు చాలా క్రూరంగా ఉన్నాయి. అవి తెలుసుకున్న పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈక్రమంలోనే అమెరికా కోర్టు ఈ జంటకు 100 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అమెరికాలోని జార్జియాకు చెందిన 34 ఏళ్ల విలియం జులాక్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించిన ఇతడు ఓ స్వలింగ సంపర్కుడు. ఈక్రమంలోనే అతడు బ్యాంకులో పనిచేసే 36 ఏళ్ల జాకరీ జులాక్‌తో ప్రేమలో పడ్డాడు. ఒకరికొకరు బాగా నచ్చడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఒక్కటయ్యారు. ఆర్థికంగా కూడా బాగుండడంతో వీరు అట్లాంటాలోని సంపన్న కుటుంబాలు నివసించే చోటే ఉంటున్నారు.


ఇదంతా బాగానే ఉన్నా.. విలియం, జాకరీలకు పిల్లలు లేరనే బాధ ముందు నుంచే ఉండేది. ఈక్రమంలోనే ఈ గే జంట ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈక్రమంలోనే క్రైస్తవ ప్రత్యేక అవసరాల ఏజెన్సీకి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పారు. ఆర్థికంగా కూడా వీళ్లు బాగుండడంతో.. ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చేందుకు ఆ సంస్థ ఒప్పుకుంది. ఇలా 10, 12 ఏళ్ల వయసు కల ఇద్దరు కుమారులను ఈ జంట దత్తత తీసుకుంది. వారిని ఇంటికి తీసుకెళ్లి హాయిగా జీవనం సాగిస్తోంది.


అయితే ఇదంతా బయటకు కనిపించేది మాత్రమే. అసలు వీళ్లు ఇంట్లో ఉండే తీరే వేరు. ముఖ్యంగా ఈ గే జంటకు చిన్న పిల్లలతో శారీరకంగా కలవడం చాలా ఇష్టం. అందుకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారితో రాక్షస క్రీడలు జరిపే వారు. అంతేకాకుండా దాన్ని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టేవాళ్లు. పక్కన ఉన్న ఇళ్లన్నీ సంపన్నులకు చెందినవి కావడం, అందులోనూ వీరు గేలు కావడంతో.. వీరి ఇంట్లో జరిగేదేది బయట తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2022 సంవత్సరంలో.. దత్తపుత్రులపై రెండేళ్ల పాటు లైంగిక దాడికా పాల్పడినందుకు గాను అరెస్టయ్యారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఈ గే జంటకు తాజాగా అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా వారు చేసిన దారుణాలకు గాను.. పెరోల్‌కు అవకాశం లేకుండా 100 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం బాలులు ఇద్దరు పిల్లల సంరక్షణలో ఉన్నారు. అయితే ఈ గే జంటకు సంబంధించిన ఆస్తులు అన్నీ ఈ పిల్లలకే చెందుతాయని పోలీసులు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com