వైసిపి అధిష్టానం పిలుపుమేరకు పెందుర్తిలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ ప్రజలపై రూ. 15, 000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని కూటమి ప్రభుత్వం మోపిందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలన్నారు.