ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసింది

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 02:26 PM

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 164 ప‌రుగులు చేసింది. టీమిండియా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ య‌శస్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ (82) తో రాణించ‌గా.. విరాట్ కోహ్లీ (36), కేఎల్ రాహుల్ (24) ర‌న్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. కేవలం 3 ర‌న్స్‌కే పెవిలియ‌న్ చేరాడు. దాంతో టీమిండియా 8 ప‌రుగుల‌కే మొద‌టి వికెట్ కోల్పోయింది.  ఆ త‌ర్వాత కేఎల్ రాహుల్ (24) క్రీజులో కుదురుకున్న‌ట్లు క‌నిపించాడు. కానీ క‌మిన్స్ వేసిన ఓ చ‌క్క‌టి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 51 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ పారేసుకుంది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ప‌డ్డాడు. మ‌రోవైపు ఓపెన‌ర్ య‌శ‌స్వి దాటిగా బ్యాటింగ్ చేసి, అర్ధ శ‌త‌కం న‌మోదు చేసుకున్నాడు. ఈ ద్వ‌యం 102 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పి భార‌త శిబిరంలో ఆనందం నింపింది. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. య‌శిస్వి ర‌నౌట్ కావ‌డంతో భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ వెంట‌నే కోహ్లీ కూడా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. ఇక నైట్‌వాచ్‌మెన్‌గా వ‌చ్చిన ఆకాశ్ దీప్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 159 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. అంత‌కుముందు ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విషం తెలిసిందే. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 311/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జ‌ట్టు మ‌రో 163 ప‌రుగులు జోడించి మిగ‌తా 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత సెంచ‌రీ (140) సాధించ‌గా.. సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖావాజా (57), ల‌బుషేన్ (72) అర్ధ శ‌త‌కాలు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా. ర‌వీంద్ర జ‌డేజా 3, ఆకాశ్ దీప్ 2, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒక‌ వికెట్ తీశారు.  రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ స్కోరు 164/5 కాగా.. క్రీజులో రిష‌భ్‌ పంత్ (06), ర‌వీంద్ర జ‌డేజా (04) ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్‌, బొలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కంటే భార‌త్ ఇంకా 310 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com