చాలా మంది మటన్ ఇష్టంగా తింటారు. కొంతమందికి మటన్ లేనిదే ముద్దదిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు మటన్‌ను లాగించాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ చాప్ స్టిక్స్, మటన్ ఫ్రై ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అని ఓ పట్టు పడుతున్నారు. మటన్ రేటు ఎక్కువ ఉన్నా సరే కొందరు వారానికి రెండు, మూడు సార్లు తింటుంటారు. మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మటన్‌లో వివిధ రకాల సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ఒలేయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఇది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం కూడా మటన్‌లో పుష్కలంగా ఉంటుంది. అయితే, మటన్ ఎలా పడితే అలా తినకూడదు. చాలా మంది ఇష్టమని చెప్పి ఎక్కువ తింటారు. అదే వాళ్లు చేసే తప్పు. మటన్ ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్ ఎలా, ఎంత, ఎప్పుడు తినాలో ఇక్కడ తెలుసుకోండి.
మటన్ ఎక్కువ తింటే డేంజర్..
మటన్ ఎక్కువ తినకూడదని నిపుణులు అంటున్నారు. కొంతమంది, మటన్ తింటే ఆరోగ్యానికి మంచిదన్న భావనతో ప్రతిరోజూ తింటూ ఉంటారు. ఎక్కువగా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఆ సమస్యలేంటో చుద్దాం.
అధిక కొలెస్ట్రాల్..
మటన్ ఎక్కువ తినడం మంచిది కాదు. మటన్ రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది. మటన్‌లో సంతృప్తికర కొవ్వులు అధిక స్థాయిలో ఉంటాయి. దీంతో.. మటన్ అధిక మోతాదులో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే మటన్ తక్కువ మోతాదులో తినాలని సూచిస్తున్నారు.
బరువు పెరుగుతారు..
మటన్ రోజూ తింటే బరువు పెరిగే ప్రమాదముంది. మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధ్యమైనంత వరకు త్వరగా బర్న్ అవ్వాలి. ఇవి బర్న్ అవ్వకపోతే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో అధిక బరువు పెరిగే ప్రమాదముంది. అందుకే మటన్ ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు.
క్యాన్సర్ ముప్పు..
మటన్ అధికంగా తినడం వల్ల శరీరంలోని కొన్ని రకాల క్యాన్సర్ కణాలు తయారవుతాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీని కారణంగా వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మటన్ ఎక్కువగా తినకూడదు. అంతేకాకుండా ఇప్పటికే క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మటన్ తినకపోవడమే ఉత్తమం అంటున్నారు.
యూరిక్ యాసిడ్..
ఈ రోజుల్లో చాలా మంది అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మటన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రమాదం పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పుల్లో స్పటికాలు నిక్షిప్తమై నొప్పులు తీవ్రమవుతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో వేడి చేసే అవకాశం ఉంది. మటన్ ఎక్కువ తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మటన్ తినే విధానం..
మటన్ ఎలా పడితే అలా తినకుండా.. మితంగా తినాలి. ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుంది. వారానికి ఒకసారి మాత్రమే మటన్ తినడం బెస్ట్ అంటున్నారు. అది కూడా 200 గ్రాములకు మించకూడదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మటన్ రాత్రి వేళల్లో తినకూడదంటున్నారు. ఎందుకంటే మటన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వచ్చి నిద్ర భంగం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక, మటన్ బాగా ఉడికించి తినాలని సూచిస్తున్నారు.