నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం రెండో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలలో అర్ధరాత్రి తర్వాత రహదారులపై తిరగరాదని మైనర్ లకు వాహనాలు ఇవ్వవద్దని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి మద్యం తాగే వాహనాలు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.