ప్రస్తుత కాలంలో టిఫిన్స్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పడం కష్టమే. ఎన్నో రకాల బ్రేక్ ఫాస్టులు వచ్చాయి. కాలాలు మారే కొద్దీ ఎన్నో కొత్త కొత్త వెరైటీలు వచ్చాయి.కానీ పూర్వం మాత్రం ఒకటే బ్రేక్ ఫాస్ట్. అదే చద్దన్నం. చద్దన్నానికి మించింది మరొకటి లేదు. ఆ చద్దన్నం రుచే వేరు.ఇప్పటికీ పల్లెటూర్లలో చాలా మంది చద్దన్నం తింటూ ఉంటారు. ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటూ ఉంటారు. ఈ అన్నం తింటే అనేక పోషకాలు చేరతాయి.రక్త హీనత సమస్య కంట్రోల్ అవుతుంది. ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా, దృఢంగా తయారవుతాయి. జీర్ణ సమస్యలు ఏమీ ఉండవు. కడుపులో, శరీరంలో ఎలాంటి మలినాలు, విష పదార్థాలు ఉన్నా బయటకు పోతాయి.శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. దీంతో త్వరగా రోగాలు, ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఎండ దెబ్బ కూడా తగలకు. కడుపులో చల్లగా, నిండుగా ఉంటుంది. అల్సర్లు, గ్యాస్ వంటి సమ్యలు రావు.ఉదయాన్నే ఈ అన్నం తింటే రోజంగా యాక్టీవ్‌టీ ఉంటారు. నీరసం, అలసట రాకుండా ఉంటాయి. పేగుల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. హైబీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా ఒక్కటేంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.