కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ..‘‘2026 తర్వాత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో..? లేదో..? అనే సందేహం నా మదిలో ఉంది.
మోదీ తన పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే.. మహారాష్ట్రలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది’’ అని రౌత్ వ్యాఖ్యానించారు.