1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో డిసెంబర్ 3న భారత వైమానిక స్థావరాలపై పీఎన్ఎస్ ఘాజీతో దాడికి దిగింది కరాచీ నావికాదళం. ఇందుకు ప్రతిగా కమాండర్ పటాన్ శెట్టి గోపాలరావు నాయకత్వంతో డిసెంబర్ 4న గుజరాత్లో దాగి ఉన్న వారిపై మెరుపుదాడి చేసి 'ఆపరేషన్ ట్రెడెంట్' ను విజయవంతంగా పూర్తిచేసింది. అప్పటి నుంచి ఈ గెలుపుకు చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుకలు నిర్వహిస్తోంది నౌకాదళం.నేవీ డే సందర్భంగా నౌకదళంలో సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది నౌకాదళం. నౌకదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ఆర్కేబీచ్లో యుద్ధ విన్యాసాలు చేస్తుంది తూర్పు నావికాదళం. సముద్రానికి, ఆకాశానికి మధ్య రోమాలు నిక్కబొడుచుకునేలా నౌకదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేలమంది ప్రజలు సాగరతీరానికి తరలివస్తారు. నేవీ యుద్ధ నైపుణ్యాలు, సామర్థ్యం, ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు, హెలికాప్లర్లు, నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, సబ్మైరైన్, ఫైటర్ జెట్లు, స్కై డైవింగ్, నేవల్ బ్యాండ్ ప్రదర్శస్తారు. ఈసారి లేజర్ షో, డ్రోన్ షో, కళింగ చక్రవర్తి, మేకిన్ ఇండియా, భారత్ మ్యాప్, సింహం వంటి ఆకృతుల్లో యుద్ధవిన్యాసాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.నేవీ సన్నాహక విన్యాసాల్లో భాగంగా విశాఖ తీరంలో ప్రాక్టీస్ చేస్తూ గురువారం ఇద్దరు నావికులకు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విమానాల నుంచి దిగుతున్న ఇద్దరు నావికుల పారాచూట్లు గాలి అనుకూలించక ఒకదానికొకటి ముడిపడి సముద్రంలో పడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నౌకాదళ సిబ్బంది వారిని బోట్లపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చడం ప్రమాదం తప్పింది.