కేంద్రంలో 2014 నుంచి BJP అధికారంలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం BJPని అక్కడి ఓటర్లు ఆదరించడంలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 7 సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన BJP.. శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆశించినంత ప్రభావం చూపించలేక పోతుంది.
ఈ సారి మాత్రం AAPను ఓడించి ఢిల్లీ శాసనసభను దక్కించుకోవాలనే ప్రణాళికలతో ముందుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం BJP పావులు కదుపుతోంది.