కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళపాదపద్మారాధన సేవను TTD అధికారులు రద్దు చేశారు.
శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని వైభవంగా నిర్వహించారు.