ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా రికార్డుల్లో నమోదైన రేమేషియా గెల్గీ ఓ ఆసక్తికర విషయం తెలిపింది. తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు స్ట్రెచర్‌లోనే పడుకుంటానని చెప్పింది.
తన వెన్నుపూసకు చాలా పెద్ద ఆపరేషన్ జరిగిందని, వెన్నెముకలో 36 స్క్రూలు ఉన్నయాని తెలిపింది. అందువల్ల తాను తన వెన్నెముకను ఎక్కువ శాతం వంచేందుకు ఇబ్బంది పడుతానని పేర్కొంది.