ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. ‘‘ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి పరువు తీస్తున్నారు.
అంతటితో ఆగకుండా పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు వేస్తాం’’ అని తెలిపారు.