రాజంపేట పట్టణంలోని సాయి నగర్ లో పట్టపగలు చోరీ జరిగింది. నాగరాజు, లక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉద్యోగానికి వెళ్ళిన సమయంలో దొంగలు చొరబడి ఇంటి తలుపులు పగలగొట్టి 15 తులాల బంగారం, నగదు చోరీ చేసినట్లు వారు తెలిపారు. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు ఇళ్ళల్లో చొరబడి దొంగతనం చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.